అన్ని అనుమతులతో త్వరలో.ఆకివీడు.రామాలయ నిర్మాణం
అమరావతి, 15 ఏప్రిల్ (హి.స.):పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో రామాలయం నిర్మించేందుకు కోటి రూపాయలు సమకూరాయని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. నగదు మెుత్తం భక్తులే ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. త్వరలో అన్ని అనుమతులతో రామాలయం నిర్మిస్
అన్ని అనుమతులతో త్వరలో.ఆకివీడు.రామాలయ నిర్మాణం


అమరావతి, 15 ఏప్రిల్ (హి.స.):పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో రామాలయం నిర్మించేందుకు కోటి రూపాయలు సమకూరాయని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. నగదు మెుత్తం భక్తులే ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. త్వరలో అన్ని అనుమతులతో రామాలయం నిర్మిస్తామని తేల్చి చెప్పారు. ఆకివీడులో రామాలయం ఉందని ముందుగా తనకు సాక్షి మీడియా ద్వారానే తెలిసిందని.. రాముడి కోసం వెళ్తే తనపై దాడి చేయించారని డిప్యూటీ స్పీకర్ ఆరోపించారు. అనుమతి లేకుండా రామాలయం కడుతున్నామని న్యాయవాది జడా శ్రావణ్ సహా మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ వేశారని తెలిపారు.

ఈ పిటిషన్పై హైకోర్టులో నేడు విచారణ జరిగిందన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామ. ఆలయం, మసీదు, చర్చి నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరని.. పర్మిషన్ లేకుండా రామాలయం కడుతున్నట్లు పిటిషన్ ద్వారా వారు కోర్టుకు చెప్పారన్నారు. అనుమతి లేని చర్చిలపైనా చర్యలు ఉండాలని తానూ చెబుతున్నట్లు రఘురామకృష్ణరాజు తెలిపారు. అయితే, పిటిషన్లు వేసిన వారు నిర్వహిస్తున్న చర్చిలకూ ఎటువంటి అనుమతి లేదని ఆయన ఆరోపించారు. అనుమతులు లేకుండా రామాలయం నిర్మాణం జరగదని కోర్టుకు తాను విన్నవించినట్లు చెప్పుకొచ్చారు. అక్రమ నిర్మాణాలను తొలగించాలని అధికారులను తాను కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఎంతో చరిత్ర కలిగిన రామాలయం పునర్నిర్మాణానికి అనుమతి ఉండాలని జడా శ్రావణ్ కోర్టులో చెప్పారన్నారు. అదే రూల్ ప్రకారం కల్వరి సతీశ్ ప్రార్థనా మందిరానికి అనుమతి ఉండాలి కదా అని ప్రశ్నించారు.

తాడేపల్లిగూడెంలో వారు మీటింగ్ హాలు కడతామని అనుమతి తీసుకుని ఆ తర్వాత చర్చిగా మార్చుకుని ప్రార్థనలు చేస్తున్నట్లు రఘురామ చెప్పారు. ఈ విషయాన్ని అధికారులు గుర్తించి మూడు నెలల కిందటే నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఇంతవరకూ దీనిపై వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదన్నారు. నంబూరు వద్ద ఉన్న కల్వరి టెంపుల్కీ అనుమతి లేదని తర్వాత తేలిందన్నారు. అలాంటి నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని అధికారులు నోటీసులు ఇస్తే కోర్టుకు వెళ్లారని.. ఇలా చాలా చోట్ల ప్రార్థనా మందిరాలను వ్యాపార కేంద్రాలుగా చేసుకుంటున్నారని ఆరోపించారు. వీటిపై విచారణ చేసి అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు రఘురామకృష్ణరాజు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande