
వరంగల్, 15 ఏప్రిల్ (హి.స.)
నియోజకవర్గాల పునర్విభజన
(Delimitation) అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మండిపడ్డారు. బుధవారం వరంగల్లో పర్యటించిన ఆయన.. అక్కడ మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా అమలయ్యే గురిచేసేలా రాజ్యాంగబద్ధమైన ప్రక్రియను రాజకీయం చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. డీలిమిటేషన్ అనేది 2011 జనాభా లెక్కల ఆధారంగానే జరుగుతుందని స్పష్టంగా తెలిసినప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను అయోమయానికి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి ప్రతిపాదిస్తున్న 'హైబ్రిడ్ మోడల్' అనేది ప్రపంచంలో ఎక్కడా లేని వింత అని ఎద్దేవా చేశారు. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా సీఎం అసంబద్ధ వ్యాఖ్యలు చేయడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు.
డీలిమిటేషన్ పేరుతో ప్రజల్లో అపోహలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని ఇండియా కూటమి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే తప్పుడు సాకుతో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టవద్దని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతి ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, చట్టబద్ధంగా నిర్వహిస్తుందని.. అనవసరపు విమర్శలు మానుకొని రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని సీఎంకు సూచించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి వాస్తవాలను వక్రీకరించడం రేవంత్ రెడ్డికి తగదని, డీలిమిటేషన్పై అవగాహన పెంచుకోవాలని రాంచందర్ రావు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..