
అమరావతి, 15 ఏప్రిల్ (హి.స.)రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పెదకూరపాడు నియోజకవర్గంలో అన్న కాంటీన్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతరం ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. ఇప్పటికే అక్కడికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేరుకున్నారు.
మరి కాసేపట్లో ఎన్డీఏ కీలక నేతల సమావేశం జరగనుంది. ఈ భేటీలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్ మాధవ్ పాల్గొననున్నారు. రేపు(గురువారం) లోక్సభలో ప్రవేశపెట్టనున్న మహిళా రిజర్వేషన్ బిల్లుపై తీసుకోవాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. ఇప్పటికే ఈ అంశంపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు సీఎం చంద్రబాబు లేఖ రాసి మద్దతు కోరారు. ఇక తాజా రాజకీయ పరిణామాలతో పాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపైనా నేతలు చర్చించనున్నారు. సమావేశం అనంతరం ముగ్గురు నేతలు కలిసి మీడియా సమావేశం నిర్వహించే అవకాశముందని సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్