ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలి.. జోగులాంబ కలెక్టర్
ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలి.. జోగులాంబ కలెక్టర్
Collector


జోగులాంబ గద్వాల, 15 ఏప్రిల్ (హి.స.) గద్వాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సమస్యలను పరిష్కరించి, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కమిటీ సభ్యులు, వైద్యాధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం లోని కాన్ఫరెన్స్ హాలు లో నిర్వహించిన గద్వాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తో కలిసి కలెక్టర్ మాట్లాడారు. ఆసుపత్రిలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న వైద్యులు, ఇతర సిబ్బందిని నిబంధనల ప్రకారం నియమించేందుకు ముందుకెళ్లాలన్నారు. ఆసుపత్రిలో ఆయా విభాగాల వారీగా అవసరమైన పరికరాలు, ఇతర వసతుల కల్పనకు ప్రతిపాదనలు పంపాలన్నారు. ఆసుపత్రి నిధులను ప్రాధాన్యత క్రమంలో వినియోగించాలని సూచించారు. ఆసుపత్రి వద్ద పార్కింగ్ సమస్య లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మెప్మా కు సంబంధించిన అర్బన్ సెల్టర్ హోమ్ నిర్మాణానికి గతంలోనే రూ. కోటికి పైగా నిధులు మంజూరు కావడంతో తగిన స్థలంలో నిర్మించాలన్నారు. సదరన్ సర్టిఫికెట్స్ క్యాంపుకు వచ్చే దివ్యాంగులకు ఇబ్బంది లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. గాంధీ చౌక్ లోని పాత జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో పలు గదులు ఖాళీగా ఉండడంతో అక్కడికి ఆయుష్ ఆసుపత్రిని తరలించేందుకు ఆలోచించాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande