
ప్రకాశం, 15 ఏప్రిల్ (హి.స.)ప్రజలు ఛీత్కరించినా.. తిరస్కరించినా.. నిసిగ్గుగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు మాజీ సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. జగన్ మీటింగ్కు వెళ్ళకూడదని మత్స్యకారులు కట్టుబాటు చేసుకున్నారని తెలిపారు. ప్రకాశం జిల్లా నుంచి జనాలను నెల్లూరు జగన్ మీటింగ్కు తీసుకెళ్లారని అన్నారు. కృష్ణపట్నం పోర్టు కట్టిన తర్వాత చుట్టుపక్కల ఎక్కడా పోర్టు కట్టకూడదని ఆనాడు వైఎస్ఆర్ జీవో ఇచ్చారని గుర్తుచేశారు.
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జీవోలు రద్దు చేశామని మంత్రి చెప్పారు. అందుకే రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణాలు జరిగాయని తెలిపారు. జగన్ తప్పుడు పనులు చేసి ప్రజల్ని రెచ్చగొడుతున్నారంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఐదేళ్ల పాలన చూసి ప్రజలు ఛీత్కరించారన్నారు. మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉందని మంత్రి బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్