ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా కాంగ్రెస్ పార్టీ.. జీవన్ రెడ్డి
ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా కాంగ్రెస్ పార్టీ.. జీవన్ రెడ్డి
Jeevan Reddy


జగిత్యాల, 15 ఏప్రిల్ (హి.స.) కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిందని పార్టీ సూచనతో ప్రభుత్వం నడవాలి కానీ ప్రభుత్వం సూచనతో పార్టీ నడుస్తుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న రేవంత్ రెడ్డి తన పట్ల చేసిన వ్యాఖ్యలకు జీవన్ రెడ్డి ఘాటుగా స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిందని అలాంటి కంపెనీలో బ్యాండ్ వాగన్ గా నేను కొనసాగలేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పై పార్టీ పట్టు కోల్పోయిందని పార్టీ సూచనల మేరకు ప్రభుత్వం నడవాలని కానీ రేవంత్ ప్రభుత్వం సూచనల మేరకు పార్టీ పని చేస్తుందని అన్నారు. పదవులు ఎప్పటికీ శాశ్వతం కాదని పదవులే కావాలి అనుకుంటే నీ దగ్గర పడిగాపులు కాసేవాడిని అని నేను అన్ని పదవులు చూసాను నువ్వు ఏమి చూశావో నాకు తెలీదు అని విమర్శించారు. నేను కేసీఆర్ పట్ల విధానపరమైన విమర్శ చేశాను తప్ప వ్యక్తిగతంగా ఏనాడు విమర్శించలేదని కేసీఆర్ నా వయసుకు గౌరవం ఇస్తూ నన్ను అన్న అని పిలుస్తాడు నీలాగా కాదు అని కౌంటర్ ఇచ్చాడు. పిల్లిని లోపల వేసి కొడితే తిరుగపడుతది అని హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande