డ్రైవర్ హత్యకేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. పిటిషన్ కొట్టివేత
డ్రైవర్ హత్యకేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. పిటిషన్ కొట్టివేత
డ్రైవర్ హత్యకేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. పిటిషన్ కొట్టివేత


అమరావతి, 15 ఏప్రిల్ (హి.స.)

సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన భార్య లక్ష్మీదుర్గకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఈ కేసులో తన ప్రమేయం లేదని, తన పేరును నిందితుల జాబితా నుంచి తొలగించాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్ను రాజమండ్రిలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. హత్య జరిగిన సమయంలో సాక్ష్యాధారాలను మాయం చేయడంలో లక్ష్మీదుర్గ కీలక పాత్ర పోషించారని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఇప్పటికే నిర్ధారించింది. ఆమెను ఈ కేసులో ఏ2 (A2) నిందితురాలిగా చేర్చారు. అయితే.. తనకు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని, రాజకీయ కారణాలతోనే తనను ఇరికిస్తున్నారని పేర్కొంటూ ఆమె కోర్టును ఆశ్రయించారు. తన భార్య అమాయకురాలని, ఆమెను కేసు నుంచి తప్పించాలని అనంతబాబు కూడా గతంలో కోరారు. పిటిషన్పై వాదోపవాదాలు విన్న న్యాయస్థానం, ప్రాసిక్యూషన్ సమర్పించిన ప్రాథమిక ఆధారాలను పరిగణనలోకి తీసుకుంది. హత్య జరిగిన తర్వాత మృతదేహాన్ని తరలించిన వాహనంలో లక్ష్మీదుర్గ ఉన్నట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయని, దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఆమెను కేసు నుంచి తప్పించలేమని స్పష్టం చేస్తూ పిటిషన్ను కొట్టివేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande