
అమరావతి, 15 ఏప్రిల్ (హి.స.)
జనాభా పెరుగుదల(Population growth)కు అనుగుణంగా చట్టసభల్లో ప్రజా ప్రతినిధుల సంఖ్యను పెంచడం, నియోజకవర్గాల సరిహద్దులను సవరించే 'డీలిమిటేషన్'(Delimitation) ప్రక్రియకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) పూర్తి మద్దతు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టదలచిన ఈ నియోజకవర్గాల పునర్విభజన నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నామని పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) స్పష్టం చేశారు. పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా ప్రాతినిధ్యం ఉండటం ప్రజాస్వామ్య బద్ధమని సజ్జల అభిప్రాయపడ్డారు.
ఈ ప్రక్రియలో..
అయితే ఈ ప్రక్రియలో ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను, ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని సజ్జల కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గాల మార్పులు చేసే సమయంలో స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, వారి అభ్యంతరాలను శాస్త్రీయంగా పరిష్కరించాలని ఆయన కోరారు. పారదర్శకమైన పద్ధతిలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ పునర్విభజన ప్రక్రియ కొనసాగాలని వైఎస్సార్సీపీ తరపున సజ్జల సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV