వెల్లంపల్లి శ్రీనివాస్ అనుచరుడి కీచకపర్వం.. నగ్న ఫొటోలతో వివాహితపై వేధింపులు
వెల్లంపల్లి శ్రీనివాస్ అనుచరుడి కీచకపర్వం.. నగ్న ఫొటోలతో వివాహితపై వేధింపులు
జగన్


అమరావతి, 15 ఏప్రిల్ (హి.స.) మహిళ వద్ద తీసుకున్న అప్పును తిరిగివ్వమని అడిగినందుకు.. మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అనుచరుడు కీచకంగా వ్యవహరించాడు. వివాహితను లోబర్చుకుని, ఆమె నగ్న చిత్రాలతో బ్లాక్మెయిలింగ్కు పాల్పడిన వైఎస్సార్సీపీ నాయకుడు ముద్దు బాలవెంకటేశ్వర్లు ఉదంతం భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. రాజకీయ అండదండలతో రెచ్చిపోయిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు గతంలో బాలవెంకటేశ్వర్లుకు కొంత నగదును అప్పుగా ఇచ్చింది. ఆ డబ్బును తిరిగి ఇవ్వమని ఆమె కోరగా, నమ్మకంగా పిలిచి ఆమెకు తెలియకుండా నగ్న ఫొటోలు, వీడియోలు చిత్రీకరించాడు. ఆ ఫోటోలను చూపించి బాధితురాలిని బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని బయటపెడితే కాపురంలో చిచ్చు పెడతానని భయపెట్టి, ఆమె వద్ద నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు.

భర్తపై కూడా వేధింపులు..

నిందితుడి వేధింపులు అంతటితో ఆగలేదు. బాధితురాలి భర్తను కూడా లక్ష్యంగా చేసుకున్నాడు. అతడిని చంపేస్తానని బెదిరిస్తూ మానసిక ఆందోళనకు గురిచేశాడు. బాలవెంకటేశ్వర్లు రాజకీయ పలుకుబడితో తమను ఏమైనా చేస్తాడనే భయంతో బాధితులు కొంతకాలం మౌనంగా భరించారు. అయితే వేధింపులు శృతిమించడంతో చివరకు ధైర్యం చేసి భవానీపురం పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా, అందులో బాధితురాలికి సంబంధించిన నగ్న, అసభ్య చిత్రాలు ఉన్నట్లు నిర్ధారించారు. సాక్ష్యాలను సేకరించిన అనంతరం ఆ చిత్రాలను డిలీట్ చేయించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, జడ్జి అతనికి రిమాండ్ విధించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande