సమ్మె చేస్తున్న విద్యుత్ ఆర్టిజన్లు వెంటనే విరమించి విధుల్లో చేరాలి
సమ్మె చేస్తున్న విద్యుత్ ఆర్టిజన్లు వెంటనే విరమించి విధుల్లో చేరాలి
సమ్మె చేస్తున్న విద్యుత్  ఆర్టిజన్లు వెంటనే విరమించి విధుల్లో చేరాలి


హైదరాబాద్, 16 ఏప్రిల్ (హి.స.)

సమ్మె చేస్తున్న విద్యుత్ ఆర్టిజన్లు... దానిని వెంటనే విరమించి గురువారం ఉదయం 11 గంటలలోగా విధుల్లో చేరాలని, లేకుంటే వారిని ఉద్యోగం నుంచి తొలగించినట్లేనని ట్రాన్స్కో బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ నిత్యావసర సేవల నిర్వహణ చట్టం(టెస్మా) కింద కరెంట్ సరఫరా నిత్యావసరాల కిందకు వస్తుందని, విద్యుత్ సంస్థల్లో సమ్మెలపై నిషేధం ఉందని స్పష్టం చేసింది. ఈ చట్టం కింద సమ్మె అక్రమమని, ఇప్పటికీ విధుల్లో చేరని తాత్కాలిక ఉద్యోగులు(ఆర్టిజన్లు) గురువారం విధుల్లో చేరాలని సూచించింది. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ల ఐక్య కార్యాచరణ సమితి పారిశ్రామిక ట్రైబ్యునల్లో గతంలో కేసు దాఖలు చేసింది. అది విచారణలో ఉండగా సమ్మెకు వెళ్లడం కూడా నిబంధనలకు విరుద్ధమని ట్రాన్స్కో వివరించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande