చారిత్రక అడుగు.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ ప్రధాని మోడీ కీలక ట్వీట్
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ ప్రధాని మోడీ కీలక ట్వీట్
modi


ఢిల్లీ, 16 ఏప్రిల్ (హి.స.)

మరికొద్ది సేపట్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు (Special sessions of Parliament) ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళా రిజర్వేషన్ బిల్లు (Women's Reservation Bill) అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాభివృద్ధిలో మహిళల పాత్రను గుర్తిస్తూ, వారి గౌరవమే దేశానికి గర్వకారణమని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశాల ద్వారా ప్రభుత్వం మహిళా సాధికారతకు సంబంధించి ఒక అద్భుతమైన అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతోందని ప్రధాని మోడీ (Prime Minister Modi) తన ట్వీట్ లో రాసుకొచ్చారు. పార్లమెంట్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియను వేగవంతం చేస్తూ, 'నారీ శక్తి వందన్ అధినియం' అమలు దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు.

ఈ ప్రత్యేక సమావేశాలు మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచడంలో ఒక మైలురాయి గా నిలుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళా శక్తిని సూర్యోదయ కాంతితో పోలుస్తూ ఋగ్వేద మంత్రాన్ని ఉటంకించడం ద్వారా, భారతీయ సంస్కృతిలో స్త్రీకి ఉన్న ఉన్నత స్థానాన్ని మోడీ గుర్తు చేశారు. ఇదిలా ఉంటే మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన తుది సవరణలు ఈ మూడు రోజుల సమావేశాల్లో (ఏప్రిల్ 16-18) చర్చకు వచ్చే అవకాశం ఉంది. మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ వంటి ప్రముఖులు ఇప్పటికే ఈ నిర్ణయానికి మద్దతు తెలపడం గమనార్హం.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande