తుప్పల్లో దొరుకుతుంది.. రోగాల తుప్పు వదిలిస్తుంది.. ఈ తీగ గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు
ఈ తీగ గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు
unveiling-the-health-benefits-of-thippa-theega-giloy-uses-and-ayurvedic-insights-1792824.


బెంగళూరు, 16 ఏప్రిల్ (హి.స.)ప్రకృతిలో ఎన్నో రకాల సహజ ఔషధ మొక్కలు ఉన్నాయి.. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలకు దివ్యౌషధంలా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలాంటి పవర్ఫుల్ ఔషధ మొక్కల్లో తిప్పతీగ ఒకటి.. డైలీ తిప్పతీగ రసం తీసుకుంటే.. చాలా అనారోగ్య సమస్యలు దూరం చేసుకోవచ్చు.. ఇక తిప్పతీగ ప్రత్యేకత ఏంటంటే.. ఆకులు, కాండం, వేర్లు.. అన్ని విలువైనవే.. అందుకే.. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో తిప్పతీగ ప్రాముఖ్యత ఈ మధ్య కాలంలో చాలా మందికి సుపరిచితమైంది. పల్లెటూళ్ళలో పొలాల గట్ల మీద, పొదలలో విరివిగా కనిపించే ఈ మొక్కను ఆయుర్వేద వైద్య శాస్త్రం ఏనాడో గుర్తించి దాని ఉపయోగాన్ని తెలియజేసింది. అయితే, ఇటీవల పలు రకాల వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దీని ఔషధ గుణాలపై ప్రజలకు అవగాహన మరింత పెరిగింది.తిప్పతీగలో ఉన్న శాస్త్రీయ ప్రయోజనాల గురించి ఆరోగ్య నిపుణులు బెంగళూరుకు చెందిన డా. బి ఎస్ అనురాధా ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

తిప్పతీగలో 35 రకాలకు పైగా ఔషధ గుణాలు కలిగిన ఫైటోకెమికల్స్ ఉన్నాయని గుర్తించారు. వీటిలో ముఖ్యంగా 15 రకాల ఆల్కలాయిడ్స్, ఆరు రకాల గ్లైకోసైడ్స్, ఐదు రకాల డై టర్పినాయిడ్స్, నాలుగు రకాల స్టిరాయిడ్స్, ఐదు రకాల ఆలిఫ్యాటిక్ కాంపౌండ్స్ ఉన్నాయి. ఈ రసాయన సమ్మేళనాలు తిప్పతీగకు అద్భుతమైన ఔషధ లక్షణాలను అందిస్తాయి. 2016 సంవత్సరంలో, లక్నోలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ (CIMAP) తిప్పతీగపై జరిపిన 170 పరిశోధన పత్రాల సారాంశాన్ని సంగ్రహించి, దాని ప్రయోజనాలను ధృవీకరించింది.

మన శరీరంలోకి వైరస్లు లేదా బ్యాక్టీరియాలు ప్రవేశించినప్పుడు వాటిని పసిగట్టే టి హెల్పర్ కణాలు కీలక పాత్ర పోషిస్తాయి. తిప్పతీగ ఈ టి హెల్పర్ కణాల సంఖ్యను గణనీయంగా పెంచుతుంది. ఈ కణజాలం పెరగడం వల్ల శరీరం త్వరగా స్పందించి, వ్యాధికారక క్రిములను గుర్తించి, రక్షణ వ్యవస్థను అప్రమత్తం చేస్తుంది.

భవిష్యత్తులో అదే వైరస్ లేదా బ్యాక్టీరియా మళ్ళీ శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి యాంటీబాడీలు చాలా అవసరం. తిప్పతీగ బీ కణాలను (B cells) ఉత్తేజపరుస్తుంది. ఇవి యాంటీబాడీల ఉత్పత్తిని పెంచుతాయి.. తద్వారా దీర్ఘకాలిక రక్షణ లభిస్తుంది. తిప్పతీగ రోగనిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా, శరీర వాపును తగ్గించడంలో కూడా తోడ్పడుతుంది.

స్థూలకాయం ఉన్నవారిలో కొవ్వు కణాలు అధికంగా వాపును కలిగిస్తాయి, ఇది వైరస్ ఇన్ఫెక్షన్ల తీవ్రతను పెంచుతుంది. తిప్పతీగలో అరబినో గలాక్టిన్ అనే రసాయనం ఉంటుంది, ఇది స్థూలకాయం వల్ల కలిగే వాపును తగ్గించి, ఇన్ఫెక్షన్ తీవ్రత పెరగకుండా సహాయపడుతుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande