రాజధాని అమరావతిలో బసవరామ తారకం క్యాన్సర్.ఆసుపత్రి త్వరలో అందుబాటులోకి
అమరావతిలో బసవరామ తారకం క్యాన్సర్ఆసుపత్రి
రాజధాని అమరావతిలో బసవరామ తారకం  క్యాన్సర్.ఆసుపత్రి త్వరలో అందుబాటులోకి


పట్టాభిపురం, 17 ఏప్రిల్ (హి.స.)

, రాజధాని అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని ప్రముఖ సినీనటులు, హిందూపురం ఎమ్మెల్యే, ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ వెల్లడించారు.

గుంటూరు వచ్చిన బాలకృష్ణకు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ స్వాగతం పలికి సత్కరించారు. ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అమరావతిలో నిర్మిస్తున్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, బాలకృష్ణ నటిస్తున్న సినిమాల గురించి చర్చించుకున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న 111వ చిత్రం విజయదశమికి విడుదలవుతుందని, జూన్ నుంచి మరో సినిమాలో నటిస్తున్నట్లు బాలయ్య చెప్పారని మోహనకృష్ణ వివరించారు. బాలకృష్ణ అభిమాన సంఘం అద్యక్షులు బెల్లంకొండ సురేష్ తదితరులు బాలయ్యను కలిశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande