
ఏలేశ్వరం, 17 ఏప్రిల్ (హి.స.)
: కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలోని చిన్నంపేట వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై కార్బన్ డైయాక్సైడ్ లోడ్తో వెళ్తున్న లారీని బొలెరో వాహనం ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి లారీ దగ్ధమైంది. విశాఖపట్నం నుంచి మహారాష్ట్రకు లారీ వెళ్తోండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారమందుకున్న ప్రత్తిపాడు అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. రెండు వాహనాల డ్రైవర్లు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో.. పోలీసులు క్రమబద్ధీకరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ