
అమరావతి, 02 ఏప్రిల్ (హి.స.)
శ్రీకాకుళం జిల్లాలో పదో తరగతి మూల్యాంకనం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సోమవారం నుంచి రెండు కేంద్రాల్లో ప్రక్రియ ప్రారంభమవుతుంది. వివిధ జిల్లాల నుంచి అన్ని సబ్జెక్టులు కలిపి మొత్తం 2.09 లక్షల సమాధాన పత్రాలు వచ్చాయి. వాటిని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. మూల్యాంకన సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉండేలా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ బాలికోన్నత, శ్రీచైతన్య పాఠశాలల్లో మూల్యాంకన ప్రక్రియ జరగనుంది. ఒక్కో టేబుల్ వద్ద సహాయ ఎగ్జామినర్లు, ప్రత్యేక సహాయకులు, ఒక చీఫ్ ఎగ్జామినర్ ఉంటారు. మొత్తం 846 మంది ప్రక్రియలో పాల్గొంటారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ