
అమరావతి, 02 ఏప్రిల్ (హి.స.)
శ్రీకాకుళం నగరం గుడివీధికి చెందిన బూర శ్యామసుందరరావుకు చిన్నప్పటి నుంచి వినికిడి లోపం ఉండేది. తోటి విద్యార్థులు ఆయనతో పెద్దగా కలిసేవారు కాదు. వ్యాయామోపాధ్యాయుడు మండా జగన్నాథరావు ప్రోత్సాహంతో క్రీడాసాధన ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో తొలి పదేళ్లు బాస్కెట్బాల్ ఆటలో తర్ఫీదు పొంది.. జాతీయ, రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించారు. తన లోపం కారణంగా తోటి క్రీడాకారులను సమన్వయం చేసుకోవడంతో ఇబ్బంది పడుతుండటంతో సాధనను అథ్లెటిక్స్ దిశగా మళ్లించారు. అత్యంత వేగంగా పరుగెత్తి 100, 200 మీటర్ల లక్ష్యాలను చేరుకునే స్ప్రింటర్గా మారారు. పారా పోటీల్లోనే కాకుండా ఓపెన్ కేటగిరీల్లోనూ సత్తా చాటుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ