ఆంధ్రప్రదేశ్.రాజధానిగా.అమరావతి చట్ట సవరణ బిల్లుకు లోకసభ ఆమోదం
న్యూఢిల్లీ, 02 ఏప్రిల్ (హి.స.) ,:జగన్ ఐదేళ్ల పాలనలో అంధకారంలో పడిన అమరావతి భవిష్యత్ ఇక దేదీప్యమానంగా ప్రకాశించేందుకు మార్గం సుగమమైంది. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన రాష్ట్ర పునర్విభజన చట్ట సవరణ బ
ఆంధ్రప్రదేశ్.రాజధానిగా.అమరావతి చట్ట సవరణ బిల్లుకు లోకసభ ఆమోదం


న్యూఢిల్లీ, 02 ఏప్రిల్ (హి.స.)

,:జగన్ ఐదేళ్ల పాలనలో అంధకారంలో పడిన అమరావతి భవిష్యత్ ఇక దేదీప్యమానంగా ప్రకాశించేందుకు మార్గం సుగమమైంది. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన రాష్ట్ర పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. 2024 జూన్ 2 నుంచి అమరావతిని రాష్ట్ర రాజధానిగా చట్టం ద్వారా గుర్తిస్తున్నట్లుగా ఈ బిల్లులో పేర్కొన్నారు. దానితోపాటు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) రాజధానిగా నోటిపై చేసిన ప్రాంతమంతా అమరావతి పరిధిలోకి వస్తుందని తెలిపారు. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ బుధవారం ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై దాదాపు రెండు గంటలపాటు చర్చ జరిగింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా 11 పార్టీలకు చెందిన 18 మంది ఎంపీలు ఇందులో పాలుపంచుకున్నారు. బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించిన వైసీపీ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత బిల్లును మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. గురువారం రాజ్యసభ ముందుకు ఈ బిల్లు రానుంది. అక్కడ ఆమోదం పొందడం కూడా లాంఛనమే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం లభించగానే చట్టరూపం దాలుస్తుంది. 2014 ఫిబ్రవరి 18న లోక్సభలో తీవ్ర గందరగోళం, వాగ్యుద్ధాలు, ఎంపీల పరస్పర దాడులు, తోపులాటలు, పెప్పర్ స్ర్పే ప్రయోగాల మధ్య రాష్ట్ర పునర్విభజన బిల్లు-2014ను ఆమోదించిన నాటి దృశ్యాలకు భిన్నంగా.. సదరు చట్ట సవరణ బిల్లుపై బుధవారం చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో చర్చ జరిగింది. ఆమోదమూ లభించింది. వైసీపీ లోక్సభా పక్ష నేత మిథున్రెడ్డి వ్యాఖ్యలను టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు.. బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ను మిథున్రెడ్డి అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు తప్ప.. బిల్లుపై చర్చ, ఆమోదానికి ఎటువంటి అంతరాయం కలుగలేదు. కాంగ్రెస్, ఇతర ఇండీ కూటమి పార్టీలు, ఎన్డీఏ పార్టీలన్నీ ముక్తకంఠంతో అమరావతి రాజధానికి చట్టబద్ధతను స్వాగతించాయి. వైసీపీ ఒక్కటే వ్యతిరేకించింది. రాజధానికి భూములిచ్చిన రైతుల ప్రయోజనాలకు బిల్లులో ప్రాధాన్యం లేదని మిథున్రెడ్డి అన్నారు. దానిని ఓటింగ్కు పెట్టినప్పుడు ఆయనతోపాటు మిగతా ముగ్గురు వైసీపీ ఎంపీలు వైఎస్ అవినాశ్రెడ్డి, తనూజారాణి, ఎం.గురుమూర్తి వాకౌట్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande