శస్త్ర.చికిత్స కోసం.చెన్నూరు వెళ్లి 50 వేలకు.బిడ్డను.అమ్మిన కసాయి తండ్రి
శస్త్రచికిత్స కోసం చెన్నూరు ఆరోగ్య కేంద్రానికి వచ్చి, సిబ్బంది బేరమాడగా, రూ.యాభై వేలకు బిడ్డను విక్రయించిన కసాయి తండ్రి
శస్త్ర.చికిత్స కోసం.చెన్నూరు వెళ్లి 50 వేలకు.బిడ్డను.అమ్మిన కసాయి తండ్రి


అమరావతి, 02 ఏప్రిల్ (హి.స.)

శస్త్రచికిత్స కోసం చెన్నూరు ఆరోగ్య కేంద్రానికి వచ్చి, సిబ్బంది బేరమాడగా, రూ.యాభై వేలకు బిడ్డను విక్రయించిన కసాయి తండ్రి అంటూ పత్రికల్లో బుధవారం ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. ఈ మేరకు జిల్లా లీగల్ కమ్ ప్రోబేషనరీ, ప్రొటెక్షన్ అధికారి సునీత, మైదుకూరు, ఐసీడీఎస్ శ్రీదేవి, బాధితురాలు లక్ష్మీనారాయణమ్మతో కలిసి ఠాణాలో ఫిర్యాదు చేశారు. భర్త బాలనారాయణ, స్టాఫ్ నర్స్ కవిత, సెక్యూరిటీ భార్గవ, స్వీపర్ పుష్ప కలిసి నా బిడ్డను ఇతరులకు అమ్మేశారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. సీఐ ఉలసయ్య, ఏఎస్సై శంకర్ నాయక్, హెడ్ కానిస్టేబుల్ శ్రీరాములు నిందితులను మంగళవారం విచారించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande