
నాగర్కర్నూల్, 02 ఏప్రిల్ (హి.స.)
కొండలు, గుహలు, లోయలు, బండరాళ్లను దాటుకుంటూ ట్రెక్కింగ్ చేస్తూ లింగమయ్యను దర్శించుకుంటున్నారు భక్తులు. నాగర్కర్నూల్ జిల్లా లోతట్టు నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన సలేశ్వర క్షేత్రం మరో అమర్నాథ్ను తలపిస్తోంది. వృద్ధులు, చిన్నారులు, యువతీ యువకులు కర్రల సాయంతో గంటల సేపు నడుస్తూ దర్శనానికి వెళ్తున్నారు. సుమారు 500 అడుగుల ఎత్తైన కొండ పైనుంచి లోయలోకి జారిపడుతున్న జలపాతం, చుట్టూ కొండలు, ప్రకృతి రమణీయత మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంతో యాత్ర సాగుతోంది. ఏటా చైత్ర పౌర్ణమి నుంచి మూడు రోజులపాటు జరిగే సలేశ్వరం జాతరకు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు బుధవారం తరలివచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ