ట్రావెల్స్ బస్సుల పన్నులను.తగ్గిస్తున్నాం
అమరావతి, 02 ఏప్రిల్ (హి.స.), , : ట్రావెల్స్ బస్సుల పన్నును త్రైమాసికానికి సీటుకు రూ.4 వేల నుంచి రూ.2,500కి తగ్గించనున్నామని, ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న బస్సులను ఏపీకి తీసుకొచ్చి రీ-రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రవాణాశాఖ మంత్రి
ట్రావెల్స్ బస్సుల పన్నులను.తగ్గిస్తున్నాం


అమరావతి, 02 ఏప్రిల్ (హి.స.), , : ట్రావెల్స్ బస్సుల పన్నును త్రైమాసికానికి సీటుకు రూ.4 వేల నుంచి రూ.2,500కి తగ్గించనున్నామని, ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న బస్సులను ఏపీకి తీసుకొచ్చి రీ-రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి కోరారు. అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో.. రవాణాశాఖ ప్రధాన కార్యదర్శి, కమిషనర్, ఇతర సీనియర్ అధికారులు, అఖిల భారత పర్యాటక బస్సుల యజమానుల సంఘ సభ్యులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. పన్ను తగ్గించిన రెండు నెలల్లో.. అరుణాచల్ప్రదేశ్, నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న 700 వరకు బస్సులను ఏపీకి తీసుకొచ్చి రీ-రిజిస్ట్రేషన్ చేయాల్సిన బాధ్యత బస్సుల యజమానులపై ఉందని మంత్రి అన్నారు. బస్సుల్లో సరకు రవాణాను అనుమతించబోమని, ప్రయాణికుల లగేజీ మాత్రమే తీసుకెళ్లాలని మంత్రి తెలిపారు. బస్సుల యజమానుల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. పన్ను తగ్గిస్తే, బస్సులన్నింటినీ ఏపీకి తీసుకొస్తామని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande