
అమరావతి, 02 ఏప్రిల్ (హి.స.)ఏపీ ప్రజలకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) బిగ్ అలర్ట్స్ జారీ చేసింది. తాజా హెచ్చరికల ప్రకారం.. నేడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వడగాల్పులు (Heatwaves) వీస్తాయని పేర్కొంది. ముఖ్యంగా రాయలసీమ మరియు కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఎండల తీవ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాయలసీమలోని కడప జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40.7 డిగ్రీల సెల్సియస్కు పైగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. కడపతో పాటు కర్నూలు, అనంతపురం, చిత్తూరు వంటి రాయలసీమ జిల్లాలతో బాటు విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు వంటి కోస్తా జిల్లాలపై కూడా దీని ప్రభావం అధికంగా ఉండనుంది.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండవచ్చని భారత వాతావరణ శాఖ (IMD), APSDMA ముందస్తుగానే హెచ్చరించాయి. తీవ్రమైన ఎండలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం 'హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్-2026'ను ఇప్పటికే అమలులోకి తెచ్చింది. ప్రజలు వడదెబ్బకు గురికాకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV