ఢిల్లీలో ఏపీ మంత్రి నారా లోకేశ్కు టీడీపీ ఎంపీలు స్వాగతం
ఢిల్లీకి చేరుకున్న ఏపీ మంత్రి నారా లోకేశ్కు టీడీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు.
నారా లోకేశ్


ఢిల్లీ, 02 ఏప్రిల్ (హి.స.)ఢిల్లీకి చేరుకున్న ఏపీ మంత్రి నారా లోకేశ్కు టీడీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీకు చెందిన ఎంపీలు ఆయనను ఆహ్వానించగా, లోక్సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా మంత్రి లోకేశ్ వారిని అభినందించారు. ఈ సందర్భంగా అమరావతి అభివృద్ధి దిశగా ఇది కీలక ముందడుగు అని ఆయన పేర్కొన్నారు.

నిన్న లోక్ సభలో బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ఉండవల్లిలోని తన నివాసం నుంచి టీవీలో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తూ హర్షం వ్యక్తం చేసిన మంత్రి లోకేశ్.. ఈ రోజు రాజ్యసభలో చర్చను గ్యాలరీ నుంచి వీక్షించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande