
అమరావతి, 02 ఏప్రిల్ (హి.స.)
ట్రావెల్స్ బస్సులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రావెల్స్ బస్సుల పన్నును తగ్గిస్తున్నట్లు తాజాగా ఏపీ రవాణా శాఖ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ట్రావెల్స్ బస్సుల పన్నును త్రైమాసికానికి సీటుకు రూ. 4,000 నుంచి రూ. 2500లకు తగ్గించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న బస్సులను ఏపీకి తీసుకురావాలని కోరారు.
ఏపీలో రీ-రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఈ సందర్భంగా ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో అఖిల భారత పర్యాటక బస్సుల యజమానుల సంఘ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఈ సందర్భంగా కొన్ని కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు.
బస్సుల్లో సరకు రవాణా అస్సలు అనుమతించకూడదని హెచ్చరించారు రాంప్రసాద్ రెడ్డి. కేవలం ప్రయాణికులకు సంబంధించిన లగేజ్ మాత్రమే తీసుకువెళ్లాలని సూచనలు చేశారు. ఈ విషయంలో రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV