
విజయనగరం, 02 ఏప్రిల్ (హి.స.)
జిల్లా మెంటాడలో విద్యుదాఘాతంతో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రూ.70వేల నగదు, 3 తులాల బంగారం, ఇతర వస్తువులు దగ్ధమయ్యాయి. మండల వీధిలోని మండల సత్యవతి ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రూ.8 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక సిబ్బంది అంచనా వేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ