పెట్రోల్. డీజల్ సరఫరాలో. తాత్కాలిక అంతరాయాలు
పెట్రోల్. డీజల్ సరఫరాలో. తాత్కాలిక అంతరాయాలు
పెట్రోల్. డీజల్ సరఫరాలో. తాత్కాలిక అంతరాయాలు


అమరావతి, 27 ఏప్రిల్ (హి.స.)

పెట్రోల్, డీజిల్ సరఫరాలో తాత్కాలిక అంతరాయాలు ఉన్నప్పటికీ రవాణా సేవలు ఆగకూడదని అధికారులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిఆదేశించారు. రవాణా సంస్థలు అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. పెట్రోల్, డీజిల్ సరఫరాలో తాత్కాలిక అంతరాయాలు ఉన్నప్పటికీ, ప్రయాణికుల సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బస్సులు, ఇతర రవాణా సేవలు నిరంతరంగా కొనసాగించాలని వ్యాఖ్యానించారు. రవాణా సంస్థలు, ప్రైవేట్ ఆపరేటర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎక్కడైనా నిర్లక్ష్యం వల్ల ప్రయాణికులకు అసౌకర్యం కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా ఆందోళన చెందకుండా తమకు సహకరించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కోరారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande