సీనియర్ న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ కోర్టు విధుల బహిష్కరణ
సీనియర్ న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ కోర్టు విధుల బహిష్కరణ
Court boycott


జగిత్యాల, 27 ఏప్రిల్ (హి.స.) జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది గంగుల సత్యార్థ ప్రకాష్

(Advocate Satyardha Prakash ) పై గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం దాడి చేసి గాయపరిచారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కోరుట్ల లో న్యాయవాదులు కోర్టు విధులను ( Boycott ) బహిష్కరించారు.

ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు తోట ఆంజనేయులు మాట్లాడుతూ సీనియర్ న్యాయవాదిపై దాడి చేయడం హేమమైన చర్యని అన్నారు. న్యాయవ్యవస్థలో న్యాయవాదులకే రక్షణ కరువైతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. నిందితులను అరెస్టు చేసి దాడి వెనుక ఎంతటి వారున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ప్రధాన కార్యదర్శి సుతారి శ్రీనివాస్ మాట్లాడుతూ ఘటన జరిగి మూడు రోజులు అవుతున్నా పోలీసులు నిందితులను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. అనంతరం బార్ అసోసియేషన్ నాయకులు కోరుట్ల సీఐ లక్ష్మినారాయణ కు వినతి పత్రాన్ని అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande