నవ భారత నిర్మాణంలో యువతే కీలక భాగస్వాములు: ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది వేడుకల్లో ఉపరాష్ట్రపతి పిలుపు
నవ భారత నిర్మాణంలో యువతే కీలక భాగస్వాములు: ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది వేడుకల్లో ఉపరాష్ట్రపతి పిలుపు
ఏయూ


విశాఖపట్నం, 27 ఏప్రిల్ (హి.స.)

భారత ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ నేడు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో అత్యంత ఉత్సాహంగా ప్రసంగించారు. వందేళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ విశ్వవిద్యాలయం దేశానికి ఎందరో మహానుభావులను అందించిందని, ఇది కేవలం ఒక విద్యాసంస్థ మాత్రమే కాదని, జ్ఞానానికి నిలయమని ఆయన కొనియాడారు. విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారిలా కాకుండా, నూతన ఆవిష్కరణలతో ఉపాధిని సృష్టించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. చదువు అనేది కేవలం పట్టా పొందడానికే కాకుండా సామాజిక మార్పుకు సాధనంగా ఉండాలని, నేర్చుకున్న జ్ఞానం దేశాభివృద్ధికి తోడ్పడాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యంగా మహిళా సాధికారత గురించి ప్రస్తావిస్తూ, దేశ పురోగతిలో మహిళలు నాయకత్వ పాత్రలు పోషించాలని సూచించారు. ఈ వేదికపై ఉన్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జీవితాన్ని ఉదాహరణగా చూపిస్తూ, పట్టుదల మరియు నిరంతర కృషితో యువత అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయాలని ఆయన స్ఫూర్తిని నింపారు. ఈ చారిత్రక వేడుకల్లో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం అందించిన సేవలను గుర్తుచేస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు ఆయన దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో భాగంగానే శతాబ్ది స్మారక నాణెం, తపాపా బిళ్ల మరియు కాఫీ టేబుల్ బుక్ను కూడా విడుదల చేశారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande