ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

అమరావతి, 28 ఏప్రిల్ (హి.స.)

ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి పి.రంజిత్ బాషా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తొలుత ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సోమవారంతో ఫీజు చెల్లించే గడువు ముగిసింది. ఎక్కువ మంది విద్యార్థులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఆ గడువును 30వ తేదీ వరకు పొడిగించారు. 30 తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ గడువు పొడిగింపు ఉండదని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande