
విశాఖపట్నం, 28 ఏప్రిల్ (హి.స.)లాయర్ తనను మోసం చేశారంటూ విశాఖ జిల్లా కోర్టులో ఓ మహిళ హల్చల్ చేశారు. నగరంలోని అక్కయ్యపాలేనికి చెందిన లక్ష్మి ఈరోజు మధ్యాహ్నం రెం డో ఏడీజే కోర్టు హాల్లోకి వచ్చి, మహిళా న్యాయమూర్తి ఎదుట నిల్చున్నారు. తాను ఓ సివిల్ కేసులో న్యాయవాది (సత్యనారాయణమూర్తి)కి ఫీజు చెల్లిచానని, అయితే ఆ లాయర్ కేసు వివరాలేవీ తనకు చెప్పకుండా అన్యాయం చేస్తున్నారని, తాను ఇచ్చిన డబ్బు వెనక్కి ఇచ్చేలా చూడాలని కోరారు. లేదంటే కోర్టు హాల్లోనే పీక కోసుకుంటానంటూ తన వెంట తెచ్చుకున్న కత్తితో హల్చల్ చేశారు. కొంతమంది లాయర్లు, పోలీసులు ఆమెను ఊరడించి, అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదని గుర్తించామన్న పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ