విశాఖ లో గూగుల్ డేటా సెంటర్ తో పాటు పలు ఐటీ.కంపెనీల స్థాపనకు కృషి
విశాఖ లో గూగుల్ డేటా సెంటర్ తో పాటు పలు ఐటీ.కంపెనీల స్థాపనకు కృషి
విశాఖ లో గూగుల్ డేటా సెంటర్ తో పాటు పలు ఐటీ.కంపెనీల స్థాపనకు కృషి


విశాఖపట్నం, 28 ఏప్రిల్ (హి.స.), విశాఖలో గూగుల్ డేటా సెంటర్తో పాటు పలు ఐటీ కంపెనీల స్థాపనకు కృషిచేసి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్కు ధన్యవాదాలు తెలుపుతూ తీరంలో మంగళవారం రూపొందించిన సైకత శిల్పం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, వీఎంఆర్డీఏ చైర్మన్ ఎంవీ ప్రణవ్గోపాల్ ఆధ్వర్యంలో బీచ్రోడ్డు ఎంజీఎం ఆవరణలో కళాకారుడు బాలాజీ వరప్రసాద్ ఈ సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఈరోజు గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన జరగనున్న సందర్భంగా నిరుద్యోగుల తరఫున మంత్రి లోకేశ్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ‘జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్ లోకేశ్... థ్యాంక్యూ లోకేశ్’ అంటూ సైకత శిల్పంపై రాశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande