ఈవీఎంగోదాముల భద్రతపై ప్రత్యేక దృష్టి.. భద్రాద్రి జిల్లా కలెక్టర్
ఈవీఎం గోదాములను పరిశీలించిన కలెక్టర్
Collector


భద్రాద్రి కొత్తగూడెం, 06 ఏప్రిల్ (హి.స.) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాములో అమలులో ఉన్న భద్రతా ఏర్పాట్లు, పర్యవేక్షణ విధానాలను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎంల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రతినెలా నిర్దిష్టంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ ప్రక్రియలో భాగంగా గోదాములోని భద్రతా ప్రమాణాలను పరిశీలిస్తారని తెలిపారు. తనిఖీలో భాగంగా సీసీ కెమెరా నియంత్రణ గదిని సందర్శించిన కలెక్టర్, కెమెరాల పనితీరు, రికార్డింగ్ వ్యవస్థలను స్వయంగా పరిశీలించారు. అన్ని కెమెరాలు నిరంతరం సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలని, ఎటువంటి లోపాలు ఉన్నా వెంటనే సరిదిద్దాలని సంబంధిత అధికారులకు సూచించారు. గోదాం పరిసర ప్రాంతాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, భద్రతా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande