
కాళేశ్వరం, 08 ఏప్రిల్ (హి.స.)
కాళేశ్వరం కమిషన్ నివేదికపై తీర్పు
వాయిదా పడింది. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు, దాని విచారణ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు నేడు తుది తీర్పు వెల్లడించాల్సి ఉంది.
ఈ క్రమంలో నేడు తీర్పు వస్తుందని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. తీర్పును ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..