మావోయిస్ట్ పార్టీ కీలక నేత సోది కేశాలు లొంగుబాటు
మావోయిస్టు పార్టీ కీలక నేత పీఎల్జీఏ డిప్యూటీ కమాండర్ సోది కేశాలు అలియాస్ మల్లా లొంగిపోయారు.
Maoist


హైదరాబాద్, 06 ఏప్రిల్ (హి.స.)మావోయిస్టు పార్టీ కీలక నేత పీఎల్జీఏ డిప్యూటీ కమాండర్ సోది కేశాలు అలియాస్ మల్లా లొంగిపోయారు. మల్లాతో పాటు 30 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఏకే 47తో పాటు పెద్ద మొత్తంలో ఆయుధాలను పోలీసులకు స్వాధీనం చేశారు. ఈ లొంగుబాటును అధికారులు అతి త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా మావోయిస్టులకు విధించిన డెడ్లైన్ మార్చి 31వ తేదీతో ముగిసింది. అమిత్షా వార్నింగ్ నేపథ్యంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఏపీ, తెలంగాణలకు చెందిన ఎంతో మంది కీలక నేతలు ఉన్నారు.

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande