
మెదక్, 06 ఏప్రిల్ (హి.స.) హిందూ దేవాలయాల పై జరుగుతున్న దాడులకు నిరసనగా బీజేవైఎం, బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మెదక్ పట్టణ బంద్ విజయవంతం గా కొనసాగుతుంది. మెదక్ పట్టణంలోని గాంధీ నగర్ హనుమాన్ దేవాలయం, మంబోజి పల్లి హనుమాన్ దేవాలయం పరిశుభ్రం, ఆవుల పల్లి ఆలయాల పై జరిగిన దాడులకు నిరసనగా నేడు మెదక్ బంద్ కు పిలుపునిచ్చారు. పట్టణ బంద్ కు బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపుకు వ్యాపార, వాణిజ్య సంస్థలు, హోటళ్ళు, పెట్రోల్ బంక్లు స్వచ్ఛందంగా బంద్ పాటించారు.
ఉదయం నుంచే షాపులు మూసి ఉన్నాయి. హిందూ దేవాలయాల పై జరుగుతున్న దాడులకు నిరసనగా యువత, హనుమాన్ మాల దారులు భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీ నగర్ హనుమాన్ దేవాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. మెదక్ పట్టణంలో పలు వీధుల్లో తిరుగుతూ వెళ్ళిన ర్యాలీ మంబోజి పల్లి వరకు సాగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశం, బీ జే వై ఎం అధ్యక్షుడు సతీష్ లు మాట్లాడుతూ ఇటీవల హిందూ దేవాలయం పై దాడులు పెరగడం పై ఆందోళన వ్యక్తం చేశారు. కొంత మంది ఉద్దేశ్య పూర్వకంగా దాడులు వేస్తున్నారని, ఇలాంటివి ఆపకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. . ఈ ఆందోళనలో హిందూ సంఘాలతో పాటు వ్యాపారులు సైతం పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..