రాష్ట్రపతి భవన్కు చేరిన.. అమరావతి చటబద్ధత బిల్లు..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించే దిశగా కీలక ముందడుగు పడింది. .
Amaravathi-bill-


న్యూఢిల్లీ, 06 ఏప్రిల్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించే దిశగా కీలక ముందడుగు పడింది. పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు-2026.. సోమవారం రాష్ట్రపతి భవన్కు చేరుకుంది. లోక్ సభ సచివాలయం ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది.

అమరావతి చట్టబద్ధతపై పార్లమెంట్లో అత్యంత కీలకమైన ఘట్టం ముగిసింది. లోక్ సభ, రాజ్య సభలో సుమారు ఐదు గంటల పాటు ఈ బిల్లుపై చర్చ జరిగింది. వివిధ పార్టీల సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగా.. కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రాధాన్యాన్ని వివరించింది. చర్చ అనంతరం ఎలాంటి సవరణలు లేకుండా ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. ప్రస్తుతం ఈ బిల్లు రాష్ట్రపతి పరిశీలనలో ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande