బాసర ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
బాసరలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు
Cm


నిర్మల్, 06 ఏప్రిల్ (హి.స.)

దక్షిణ భారతంలోనే ఉన్న ఏకైక

సరస్వతీ అమ్మవారి పుణ్యక్షేత్రం బాసర ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు రూ.225 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన నేడు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న బాసర ఆలయాన్ని సుమారు 60 వేల చదరపు అడుగుల మేరకు విస్తరించనున్నారు. కొత్త ఆలయ శిఖరాలు, మండపాలు, మాడవీధులు, ఇతర అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. పారతో తవ్వి సీఎం చేతుల మీదుగా పనులు ప్రారంభించారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి ఆలయ అభివృద్ధి పనులను వేగంగా చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పనులు ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక బాసర ఆలయానికి మంచి రోజులు వచ్చాయని వేద పండితులు ఈ సందర్భంగా సీఎం ఆశీర్వదించారు. బాసర అమ్మవారు సీఎం రేవంత్ రెడ్డిని తన కుమారుడు రూపంలో ఆశీర్వదించిందని పేద పండితులు అభిప్రాయపడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande