
ములుగు, 06 ఏప్రిల్ (హి.స.)
సంపాదనే ధ్యేయంగా డబ్బు పై పెడుతున్న దృష్టిని చాలామంది ఆరోగ్యం పై దృష్టి సారించడం లేదని, బయటి ఆహార పదార్థాలు తిని అనారోగ్యానికి గురవుతున్నారని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు తినే ఆహారం పై అవగాహన కార్యక్రమంలో 'ఈట్ రైట్ వాక్' కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆరోగ్య పరిరక్షణ కోసం వారం రోజుల పలు కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆరోగ్య రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్ల పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. నాణ్యమైన ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి వ్యాధులు సోకవని, రుచి కోసం బయట విచ్చలవిడిగా అమ్మకం జరుగుతున్న ఆహార పదార్థాలు తిని అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి పరిస్థితుల్లో చిన్నపిల్లలు సైతం భయంకరమైన క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారని, శుభ్రమైన ఆహారం తీసుకోవడంతో పాటు ఇంటినీ ఒంటిని శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..