కనకదుర్గమ్మను దర్శించుకున్న రాజధాని మహిళలు, రైతులు
అమరావతి, 06 ఏప్రిల్ (హి.స.)రాజధాని ప్రాంతమైన అమరావతి నుంచి మహిళలు, రైతులు కాలినడకన విజయవాడ ఆలయానికి చేరుకున్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, చీర, సారెలను అమ్మవారికి స
rajadhani-womens-visited-vijayawada-durgamma-temple-


అమరావతి, 06 ఏప్రిల్ (హి.స.)రాజధాని ప్రాంతమైన అమరావతి నుంచి మహిళలు, రైతులు కాలినడకన విజయవాడ ఆలయానికి చేరుకున్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, చీర, సారెలను అమ్మవారికి సమర్పించారు. దుర్గమ్మను దర్శించుకున్నారు. రాజధాని ప్రాంతం సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు.

అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అభివృద్ధి చేసే దిశగా అడుగులు పడుతుండటం, చట్టబద్ధమైన గుర్తింపు లభించడంతో రైతులు ఈ కృతజ్ఞతా యాత్ర చేపట్టారు. అమరావతి పరిరక్షణ సమితి నాయకులు, స్థానిక నేతలు కూడా పాల్గొన్నారు. కనకదుర్గమ్మ వారధి నుంచి ఇంద్రకీలాద్రి వరకు జై అమరావతి నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande