
అమరావతి, 07 ఏప్రిల్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలోని స్పెషాలిటీ ఆసుపత్రుల్లో జరుగుతున్న సమ్మెను విరమించినట్లు స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించింది. ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఇచ్చిన హామీల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ తెలిపింది. 10 రోజుల్లో వెయ్యి కోట్ల రూపాయలు చెల్లిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని ఆమోదించి సమ్మెను విరమించినట్లు ఆసుపత్రుల యాజమాన్య సంఘం ప్రకటించింది.
10 రోజుల్లో బకాయిలు చెల్లించని పక్షంలో మళ్లీ వైద్య సేవలను పూర్తిగా నిలిపివేస్తామని అసోసియేషన్ హెచ్చరించింది. ప్రభుత్వంతో జరిపిన చర్చల సమావేశం మినిట్స్ను కూడా కొద్ది సేపటి క్రితం అసోసియేషన్కు అధికారులు పంపించారు. ఈ మినిట్స్లో ఇచ్చిన హామీలు, చర్చల వివరాలు స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సమ్మె విరమణతో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింది అన్ని సేవలు పునఃప్రారంభం కానున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ