ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అన్ స్టాపబుల్
ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అన్ స్టాపబుల్ అని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.
AP Amaravathi


అమరావతి, 07 ఏప్రిల్ (హి.స.)రాజధాని అభివృద్ధిపై మంత్రి కొలుసు పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదున్నర కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి ఇక అన్ స్టాపబుల్ అని స్పష్టం చేశారు. 'మా రాజధాని అమరావతి' అని ప్రతి తెలుగువాడు గర్వంగా చెప్పుకునే రోజులు వచ్చాయని అన్నారు.

అలాగే, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అమరావతి బిల్లుకు ఇచ్చిన ఆమోదం.. ప్రతి తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని మంత్రి తెలిపారు. ఈ నిర్ణయం ప్రజల్లో నమ్మకం, ధైర్యాన్ని పెంచిందని ఆయన పేర్కొన్నారు. గత ఐదేళ్లలో అమరావతి అంశంపై ఎదురైన విమర్శలు, ఎగతాళి ఇప్పుడు ముగిసిపోయాయని ఆయన అన్నారు. ఇకపై ఎవరు అడిగినా 'మా రాజధాని అమరావతి' అని ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande