శంషాబాద్ ఎయిర్పోర్టులో 14.7 కిలోల గంజాయిని పట్టుకున్న కస్టమ్స్ అధికారులు
శంషాబాద్ ఎయిర్పోర్టులో గంజాయిని పట్టుకున్నారు
Ganja


హైదరాబాద్, 07 ఏప్రిల్ (హి.స.)

శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ

అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో మరోసారి భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడటం కలకలం రేపింది. ఇవాళ కస్టమ్స్ (Customs), ఎయిర్పోర్టు భద్రతా అధికారులు జరిపిన తనిఖీల్లో భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. ఎయిర్పోర్టులో ప్రయాణికుల తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ వ్యక్తి ప్రవర్తనపై అధికారులకు అనుమానం కలిగింది. దీంతో అతడి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. రహస్యంగా దాచి ఉంచిన 14.7 కిలోల గంజాయి లభ్యమైంది. అనంతరం వెంటనే అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే పట్టుబడిన గంజాయిని ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, దీనిని ఎక్కడికి తరలిస్తున్నారు? ఈ స్మగ్లింగ్ వెనుక ఏదైనా అంతర్జాతీయ ముఠా ఉందా..? అనే కోణంలో అధికారులు నిందితుడిని ప్రశ్నిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande