
హైదరాబాద్, 07 ఏప్రిల్ (హి.స.)ఔటర్ రింగ్రోడ్డు (ఓఆర్ఆర్), రీజినల్ రింగ్డు రోడ్డు (ఆర్ఆర్ఆర్) మధ్య నిర్మించతలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు భూసేకరణపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. యాచారం, కడ్తాల్, ఆమన్గల్ మండలాలకు చెందిన కుర్మిద, ఆకుతోటపల్లి, ముడ్విన్, కడ్తాల్ తదితర గ్రామాల్లో 554 ఎకరాల భూసేకరణకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ భూసేకరణ చట్టం- 2013 ప్రకారం లేదంటూ ఆయా గ్రామాలకు చెందిన అన్నేపు జంగయ్యతోపాటు 30 బాధితులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని సూచిస్తూ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను జూన్ 8వ తేదీకి వాయిదా వేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్