అమరావతి గెజిట్ పై నారాలోకేశ్ భావోద్వేగ పోస్ట్
అమరావతి గెజిట్ పై నారాలోకేశ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు
అమరావతి గెజిట్ పై నారాలోకేశ్ భావోద్వేగ పోస్ట్


అమరావతి, 07 ఏప్రిల్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం-2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏప్రిల్ 6న ఆమోదముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ సోమవారం రాత్రి అధికారిక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో అమరావతి చట్టబద్ధంగా ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా మారింది.

ఈ పరిణామంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఇది చారిత్రాత్మక రోజు. రాష్ట్రపతి ఆమోదంతో రాజధాని కల అధికారికంగా సాకారమైంది. రాష్ట్ర భవిష్యత్తు కోసం మద్దతుగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీకి, బిల్లుకు మద్దతిచ్చిన ఎంపీలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి మార్గం సుగమం చేసిన అమరావతి రైతుల ఓర్పు, త్యాగాలకు ప్రత్యేక వందనాలు’ అని ఆయన ట్వీట్ చేశారు. ఈ నిర్ణయంతో రాజధాని మార్పుపై భవిష్యత్తులో ఎలాంటి సవరణ చేయాలన్నా అది పార్లమెంటు పరిధిలోనే ఉంటుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande