ఎన్టీఆర్ జిల్లా తిరువూరు తెదేపాలో మరో వివాదం
తెదేపా పార్టీలో మరో వివాదం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు తెదేపాలో మరో వివాదం


తిరువూరు, 08 ఏప్రిల్ (హి.స) ఎన్టీఆర్ జిల్లా తిరువూరు తెదేపాలో మరో వివాదం చెలరేగింది. స్థానిక తెదేపా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, తెదేపా నేత దేవదత్ వర్గాల మధ్య విభేదాలతో ఉద్రిక్తత నెలకొంది. తిరువూరు జాతీయ రహదారిపై ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన అనుచరులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు.

ఆక్రమణలతో రాకపోకలకు అంతరాయం కలుగుతోందని, వాటిని తొలగించి ప్రభుత్వ స్థలాలను రక్షించాలని నినాదాలు చేశారు. అదే సమయంలో తన వర్గంతో రాష్ట్ర ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ ఛైర్మన్ శావల దేవదత్ అక్కడికి చేరుకున్నారు. రెండువర్గాలు పోటాపోటీగా పరస్పర వ్యతిరేక నినాదాలు చేసుకోవడంతో కొంత సమయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ‘‘తెదేపా రెండోవార్డు అధ్యక్షుడు షాహిన్ పాషా.. ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశారు. శ్రీనివాసరావు డబ్బులు డిమాండ్ చేయగా ఇవ్వలేదనే తన దుకాణాన్ని కూల్చివేస్తానని బెదిరించారని ఆరోపించారు. తహసీల్దార్ వైకుంఠరావు, కమిషనర్ మనోజ్ అక్కడకు వచ్చి ఆక్రమణలను పరిశీలించి 10 రోజుల్లో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే నిరసన విరమించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande