తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పవన్
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జల్ జీవన్ మిషన్ కింద తాగునీటి పథకాన్ని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ప్రారంభించారు.
Pawan Kalyan


అంబేడ్కర్, 09 ఏప్రిల్ (హి.స.)అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జల్ జీవన్ మిషన్ కింద తాగునీటి పథకాన్ని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. అంతర్వేదిలో రూ.17.33 కోట్ల వ్యయంతో నిర్మించునున్న తాగునీటి పథకాన్ని వర్చువల్ విధానం ద్వారా వారిద్దరూ ప్రారంభించారు. అలాగే మల్కిపురం మండలం గుడిమెళ్లంకలో రూ.5 కోట్ల ఓఎన్జీస్ నిధులతో నిర్మించ తలపెట్టిన సురక్షిత తాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణానికీ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ పథకం ద్వారా జిల్లాలో తాగునీటి సమస్యలను తీర్చవచ్చని ఈ సందర్భంగా వారు తమ అభిప్రాయాన్ని వెళ్లడించారు. అదేవిధంగా ఏపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మహేశ్ కుమార్, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande