
నర్సీపట్నం , చింతపల్లి గ్రామీణం,, 30 మే (హి.స.)
: జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల పరిధిలోని అన్ని మార్గాల్లో అదనపు బస్సు సర్వీసులు నడపాలన్న డిమాండు రోజురోజుకు పెరుగుతోంది. బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతున్నా.. రద్దీకి తగ్గట్లుగా బస్సుల సంఖ్యను ఆర్టీసీ పెంచడం లేదు. ఫలితంగా ప్రయాణికులంతా బస్సుల్లో కిక్కిరిసి రాకపోకలు సాగిస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి రద్దీ మరింత పెరిగింది. బస్సుల్లో అడుగు పెట్టేందుకూ ఖాళీ ఉండటం లేదు. ఆయా మార్గాల్లో కొంతమంది డ్రైవర్లు స్టేజీల్లో ప్రయాణికులు ఉన్నా.. బస్సులను ఆపకుండా వెళ్లిపోతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ