
హైదరాబాద్, 30 మే (హి.స.) గండిపేట పరిధిలోని ముష్కి చెరువు చుట్టూ ఉన్న షెడ్లను
హైడ్రా అధికారులు శనివారం కూల్చి వేశారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్ పనులు చేస్తున్నారు. నార్సింగి సర్కిల్ పరిధిలోని ముష్కి చెరువు చుట్టూ ఉన్న ఎన్టీఎల్, బఫర్ జోన్లో కొందరు అక్రమార్కులు నిరుపేదలను ముందు ఉంచి భారీగా షెడ్లను వేశారు. చెట్లు తొలగించాలని గతంలో హైడ్రా అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి కొంత సమయం ఇచ్చిన కూడా షెడ్లను తొలగించలేదు. దీంతో మరోమారు హైడ్రా అధికారులు చెరువు పరిధిలో ఉన్న వారికి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.
అక్రమార్కులు మిమ్మల్ని ముందుంచి కబ్జాలు చేయడానికి యత్నిస్తున్నారని తెలియజేశారు. చెట్లను గుడిసెలను ఖాళీ చేయకపోతే ఊరుకునేది లేదన్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం హైడ్రా అధికారులు ముష్కి చెరువు ప్రాంతానికి చేరుకొని షెడ్లను, గుడిసెలను జెసిబిలతో తొలగిస్తున్నారు. అదేవిధంగా చెరువు ప్రాంతానికి చుట్టూ ఫెన్సింగ్ పనులు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నార్సింగి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..