
అమరావతి, 30 మే (హి.స.)
, ‘పెద్ది’ సినిమా టికెట్ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 4వ తేదీన సినిమా విడుదల కానున్న నేపథ్యంలో జూన్ 3వ తేదీ రాత్రి 8 గంటలకు ప్రీమియర్ షో ఉండనుంది. ప్రీమియర్ షో ధరను 600 రూపాయలుగా నిర్ణయించారు. జూన్ 4వ తేదీనుంచి 10 రోజుల పాటు మల్టీప్లెక్స్లో టికెట్పై రూ.125.. సింగిల్ స్ర్కీన్ థియేటర్లలో టికెట్పై రూ.100 పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ 10 రోజుల పాటు రోజుకు 5 షోలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ