పైలట్ సమయస్ఫూర్తితో తప్పిన ముప్పు..శంషాబాద్లో విమానం అత్యవసర ల్యాండింగ్
పైలట్ సమయస్ఫూర్తితో తప్పిన ముప్పు..శంషాబాద్లో విమానం అత్యవసర ల్యాండింగ్
Aeroplane


హైదరాబాద్, 30 మే (హి.స.)

పైలట్ సమయస్ఫూర్తిగా

వ్యవహరించడంతో ఓ భారీ ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి నాగ్పూర్కు బయల్దేరిన ఇండిగో విమానం (Indigo flight)లో ఒక్కసారిగా సాంకేతిక సమస్య తలెత్తింది. ఆకాశంలో ప్రయాణిస్తున్న సమయంలో విమానంలో లోపం ఉన్నట్లు గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అధికారులకు సమాచారం అందించి, అత్యవసర ల్యాండింగ్కు అనుమతి కోరారు. అధికారుల సూచన మేరకు పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించి, విమానాన్ని హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంకు(Shamshabad International Airport) మళ్లించారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో రన్వేపై ఈ ఇండిగో ఫ్లైట్ను పైలట్ సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ (Emergency Landing) చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో మొత్తం 126 మంది ప్రయాణికులు ఉన్నారు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా కిందకు దించడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒక పెద్ద ప్రమాదం తప్పడంతో ఎయిర్పోర్ట్ అధికారులు, ప్రయాణికులు పైలట్ను అభినందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande