
వరంగల్, 30 మే (హి.స.)
వరంగల్ జిల్లా గీసుకొoడ
మండలంలో వరుస దొంగతనాలకు
పాల్పడుతున్న అంతర జిల్లాకు సంబంధించిన కరీంనగర్కు చెందిన సూర రవి, మహబూబాబాద్కు చెందిన ఎం.డి. ఇమ్రాన్ను గీసుగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.35 వేల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. సీఐ విశ్వేశ్వర్ కథనం ప్రకారం.... కోనాయమాకుల ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వద్ద ఎస్ఐ అనిల్ కుమార్ వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని అదుపులోకి తీసుకున్నారు. రాంపూర్, ఎలుకుర్తి, శాయంపేట, గొర్రెకుంట ప్రాంతాల్లో వ్యవసాయ మోటార్లు, ఇనుప సామగ్రి, బైక్ చోరీ చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. కరీంనగర్ వడ్డెర కాలనీకి చెందిన సూర రవి(35)పై 24 దొంగతన కేసులు, మహబూబాబాద్ సుక్కమ్మ బజార్కు చెందిన ఎం.డి. ఇమ్రాన్ (33)పై 9 కేసులు ఉన్నాయి. వీరి వద్ద నుంచి సెండర్ బైక్, 2 మోటార్లు, రూ.9 వేల నగదు, వాల్వ్, 8 ఐరన్ పైపులు, బకెట్లు, రాడ్లు, బిందెలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకున్న సిబ్బందిని ఇన్స్పెక్టర్ డి. విశ్వేశ్వర్ అభినందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు